హైదరాబాద్ లో వెంకటేశ్వర వైభోత్సవాలు *Telangana | Telugu OneIndia

2022-10-12 1

Sri Venkateswara Swamy Vaibhavotsavam started grandly at NTR Stadium on Tuesday. Devotees flocked in large numbers to visit the Lord Sri Venkateswara Swamy. The celebrations under the joint auspices of Tirumala Tirupati Devasthanam, Srinivasa Kalyanam and Sri Venkateswara Vaibhavotsava Project Tirupati, this will continue till the 15th of this month. Besides, laddus are made here and distributed to the devotees for free of cost | శ్రీ వేంకటేశ్వర స్వామి వైభవోత్సవాలు మంగళవారం ఎన్‌టీఆర్‌ స్టేడియంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీనివాస కల్యాణం, శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవ ప్రాజెక్ట్‌ తిరుపతి సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న వైభవోత్సవాలు 15వ తేదీ వరకు కొనసాగుతాయి. తిరుపతికి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోలేని భక్తుల కోసం టీటీడీ నగరంలో వెంకటేశ్వర స్వామి మహోత్సవాలను నిర్వహిస్తోంది.ఈ నేపథ్యంలో ఎన్‌టీఆర్‌ స్టేడియంలో ప్రతి రోజు పది వేల మంది దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు. వర్షాల కారణంగా భక్తులు ఇబ్బందులు పడకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వైభవోత్సవాలను ప్రచారం చేసేందుకు తిరుమల తిరుపతి నుంచి ప్రత్యేకంగా రూపొందించిన శ్రీ వెంకటేశ్వర స్వామి రథం నగరానికి వచ్చింది. అంతేకాకుండా ఇక్కడే లడ్డూలు తయారు చేసి భక్తులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.

#NTRStadium
#VenkateswaraswamyVaibhavotsavam
#Hyderabad
#Tirupathi
#Tirumala
#Venkateswaraswamy

Videos similaires